తాటిగూడెం గ్రామంలో వాలీబాల్ టోర్నీ
కరకగూడెం, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్;
నూతన సంవత్సర, సంక్రాంతి పండగ పురస్కరించుకొని తాటి గూడెం గ్రామంలో వాలీబాల్ టోర్నీ నిర్వహిస్తున్నట్లు ఆదివాసి యువసేన అసోసియేషన్ సభ్యులు తెలిపారు జనవరి 12,13,14 తేదీలలో ములుగు, భద్రాద్రి కొత్తగూడెం రెండు జిల్లాల స్థాయి వాలీబాల్ క్రీడలు తాటి గూడెం గ్రామంలో నిర్వహిస్తున్నామని ఈ క్రీడల కరపత్రాన్ని మణుగూరు సబ్ డివిజన్ పోలీస్ అధికారి రవీందర్ రెడ్డి గారు ఏడుళ్ళ బయ్యారం సిఐ వెంకటేశ్వరరావు గారు అశ్వాపురం సిఐ అశోక్ రెడ్డి లు ఆవిష్కరించారు క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో క్రీడలను విజయవంతం చేయాలని, క్రీడలతోపాటు చదువులలో ఉన్నత స్థానాల్లో రాణించాలని ఏజెన్సీ ప్రాంతంలో క్రీడల పట్ల మక్కువ ఎక్కువగా ఉందని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా తర్ఫీదు పొంది మన ప్రాంతం యొక్క పేరు ప్రఖ్యాతలు గడించేలా క్రీడాకారులు రాణించాలని ఈ క్రీడలను విజయవంతం చేయాలని వారు తెలియజేశారు
ఈ కార్యక్రమంలో గొగ్గలి కృష్ణయ్య, పోలేబోయిన రామారావు,కొమరం కాంతారావు,పోలెబోయిన సత్యనారాయణ, పోలేబోయిన సుధాకర్, చంద శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు
కామెంట్‌ను పోస్ట్ చేయండి