రైతుల చిరకాల కల సాకారం.. మారెళ్లపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభోత్సవం

G Rajashekar
By -
0

  



EB NEWS/ అశ్వాపురం:


పినపాక నియోజకవర్గ రైతాంగం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న సాగునీటి కల సాకారం కానుంది. అశ్వాపురం మండలంలోని మారెళ్లపాడు లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తికావడంతో రేపు ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నారు.


సీతారామ ప్రాజెక్టులో భాగంగా పూర్తిచేసిన మారెళ్లపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా అశ్వాపురం మండలంతో పాటు పినపాక నియోజకవర్గంలోని రైతులకు సాగునీటి భరోసా మరింత బలోపేతం కానుందని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తెలిపారు.


ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, భారీ నీటిపారుదల శాఖ మంత్రి నలమాడ ఉత్తమ్ కుమార్ రెడ్డి, రెవెన్యూ, హౌసింగ్, సమాచార–పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్‌చార్జి మంత్రి వాకిటి శ్రీహరి, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరుకానున్నారు.


ఈ సందర్భంగా పినపాక నియోజకవర్గ రైతులు, ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, యువజన, మహిళా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కోరారు.


23-09-2026న మారెళ్లపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభంతో రైతుల సాగునీటి ఆశలు నెరవేరనున్నాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)