తెలంగాణ మోడల్ స్కూల్స్ హాల్ టికెట్లు విడుదల

 


EB NEWS/ తెలంగాణ:


తెలంగాణ మోడల్ స్కూల్స్ అర్హత పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు విడుదలయ్యాయి. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ (http://www.tgms.telangana.gov.in)లోకి వెళ్లి తమ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని మోడల్ స్కూల్స్ సొసైటీ డైరెక్టర్ శ్రీనివాసచారి సూచించారు.


రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 19న ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 6వ తరగతి ప్రవేశ పరీక్ష జరగనుండగా, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు 7వ తరగతి నుంచి 10వ తరగతి ప్రవేశాలకు పరీక్షలు నిర్వహించనున్నారు.


అభ్యర్థులు పరీక్షకు హాజరవుతున్నప్పుడు హాల్ టికెట్‌తో పాటు అవసరమైన పత్రాలు తీసుకురావాలని అధికారులు సూచించారు.


Post a Comment

కొత్తది పాతది