పారాక్వాట్ గడ్డిమందుపై పూర్తి నిషేధం.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం



EB NEWS/తెలంగాణ:


తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో విస్తృతంగా ఉపయోగిస్తున్న పారాక్వాట్ గడ్డిమందుపై పూర్తిగా నిషేధం విధిస్తూ జీవో 24ను జారీ చేసింది. ఈ నిర్ణయం ప్రకారం పారాక్వాట్ తయారీ, నిల్వ, పంపిణీ, అమ్మకాలు అన్నీ చట్ట విరుద్ధంగా ప్రకటించబడ్డాయి.


రూల్స్ ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఈ గడ్డిమందు తక్కువ మోతాదులో ఉపయోగించినా మనుషుల శరీర అవయవాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని, అలాగే కూరగాయలు, పంటలు విషపూరితంగా మారే ప్రమాదం ఉందని వ్యవసాయ శాఖ వెల్లడించింది.


రైతుల ఆరోగ్యం, ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ సంచలన నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.


Post a Comment

కొత్తది పాతది