రూపాయికే ఫ్రీడమ్ ప్లాన్.. BSNL బంపర్ ఆఫర్

 


EB NEWS/భారత్:


దేశీయ టెలికాం సంస్థ BSNL కొత్త కస్టమర్లను ఆకర్షించేందుకు మరోసారి అదిరిపోయే ఆఫర్‌ను ప్రకటించింది. ‘ఫ్రీడమ్ ప్లాన్’ పేరుతో తీసుకొచ్చిన ఈ ప్రత్యేక ఆఫర్‌లో కేవలం ఒక్క రూపాయికే నెల రోజుల పాటు అపరిమిత కాల్స్, రోజుకు 2GB డేటా, అలాగే ఉచిత సిమ్ కార్డు అందించనుంది.


ఈ ఆఫర్ కేవలం కొత్త యూజర్లకే వర్తిస్తుందని BSNL స్పష్టం చేసింది. ఇప్పటికే BSNL సేవలను వినియోగిస్తున్న వినియోగదారులకు ఇది వర్తించదు.


ఈ బంపర్ ఆఫర్ 2026 ఏప్రిల్ 30 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని BSNL ఇండియా X (ట్విట్టర్) వేదికగా వెల్లడించింది. దీంతో తక్కువ ఖర్చుతో మంచి డేటా, కాలింగ్ సౌకర్యాలు పొందాలనుకునే వినియోగదారులకు ఇది మంచి అవకాశంగా భావిస్తున్నారు.


Post a Comment

కొత్తది పాతది