తెలంగాణ లో 36 గంటలపాటు మీ-సేవా కేంద్రాలు బంద్- కారణం ఇదే

 


EB NEWS/తెలంగాణ:


తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మీ-సేవా కేంద్రాలు 36 గంటలపాటు తాత్కాలికంగా మూతపడనున్నాయి. మీ-సేవా పోర్టల్‌లో కొత్త సాఫ్ట్‌వేర్ వెర్షన్ అప్‌డేట్ చేయడం, అలాగే డేటా సెంటర్ల వార్షిక నిర్వహణ పనులు చేపట్టడం వల్ల ఈ అంతరాయం ఏర్పడనుంది.


అధికారుల సమాచారం ప్రకారం, ఇవాళ రాత్రి నుంచి ఆదివారం ఉదయం 8 గంటల వరకు సేవలు నిలిచిపోనున్నాయి. ఈ సమయంలో కుల, ఆదాయ ధ్రువపత్రాలు, భూమి రికార్డులు, విద్యుత్ బిల్లుల చెల్లింపులు సహా అన్ని ఆన్‌లైన్ సేవలు అందుబాటులో ఉండవు.


అత్యవసర సేవల కోసం ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ప్రజలకు అధికారులు సూచించారు.


Post a Comment

కొత్తది పాతది