EB NEWS/తెలంగాణ:
తెలంగాణ రాష్ట్రంలో ఎండల తీవ్రత మరింత పెరగనున్నట్లు వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. గత కొద్ది రోజులుగా చోటుచేసుకున్న చినుకులు, మేఘావృత వాతావరణంతో కొంత ఉపశమనం లభించినప్పటికీ.. ఏప్రిల్ 10 నుంచి ‘అసలైన సమ్మర్’ మొదలవుతుందని అంచనా వేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల వరకు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఎండల ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని తెలిపారు.
ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని, మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లడాన్ని తగ్గించాలని, తగినంత నీరు తాగాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి