EB NEWS /ఆంధ్రప్రదేశ్:
ఆంధ్రప్రదేశ్‌లో చిత్తూర్ జిల్లా, తెట్టు గ్రామానికి చెందిన రైతు జీవితంలో జరిగిన సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన పొలంలో నీటి కోసం ఆ రైతు దాదాపు 10 సార్లు బోర్లు తవ్వించినా ఒక్క చుక్క నీళ్లు కూడా పడలేదు. దీంతో తీవ్ర నిరాశకు గురైన రైతు ఇక బోరు వేయడం వృథా అని భావించాడు.
అయితే ఒకరోజు సోషల్ మీడియాలో చూసిన వీడియో అతనికి కొత్త ఆశను కలిగించింది. కర్ణాటకలోని ఓ ఆలయంలో ఉన్న ఎద్దు భూమిలో నీటి జాడ ఎక్కడుందో గుర్తించి చూపుతుందని ఆ వీడియోలో తెలిపింది. దీనిని గట్టిగా నమ్మిన రైతు వెంటనే కర్ణాటకకు వెళ్లి ఆ ఆలయాన్ని సందర్శించాడు. అక్కడి ఎద్దును తన పొలానికి తీసుకువచ్చి నీటి జాడ ఎక్కడుందో చూపించాలని ప్రార్థించాడు.
పొలంలో కొంతసేపు తిరిగిన ఆ ఎద్దు ఒక్క ప్రదేశంలో నిలబడి మూత్రం విసర్జన చేసింది. అదే చోట నీటి జాడ ఉందని భావించిన రైతు వెంటనే అక్కడ బోరు తవ్వించాడు. ఆశ్చర్యకరంగా ఆ బోరులో పుష్కలంగా నీళ్లు రావడంతో రైతు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
ఎద్దు కారణంగా తనకు నీళ్లు దొరికాయని భావించిన రైతు దానికి కాళ్ల మీద పడి కృతజ్ఞతలు తెలిపాడు. ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భూమిలో నీటి జాడను ఎద్దు ఎలా గుర్తించింది? అనే ప్రశ్నకు సైన్స్ కూడా స్పష్టమైన సమాధానం చెప్పలేకపోతోందని పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి