EB NEWS /తెలంగాణ:
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మావోయిస్టులపై కీలక వ్యాఖ్యలు చేశారు. లొంగిపోయిన మావోయిస్టులు రాజకీయాల్లోకి రావాలనుకుంటే ప్రభుత్వం స్వాగతిస్తుందని ఆయన తెలిపారు. ఆదివాసీలు, గిరిజనుల ఆర్థిక స్థోమత పెరిగేలా తమ ప్రభుత్వం కృషి చేస్తోందని స్పష్టం చేశారు.
ఇప్పటికే కొందరు మాజీ మావోయిస్టులు రాజకీయాల్లోకి వచ్చి ప్రజాప్రతినిధులుగా ఎదిగారని ఆయన గుర్తు చేశారు. ఉదాహరణగా సీతక్కను ప్రస్తావిస్తూ… ఒకప్పుడు ఉద్యమాల్లో పాల్గొన్న ఆమె నేడు రాష్ట్ర మంత్రిగా సేవలందిస్తున్నారని తెలిపారు.
రాజకీయాల్లోకి రావాలనుకునే వారు కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకుంటే పీసీసీని కలిసి తమ ఆసక్తిని తెలియజేయవచ్చని సీఎం పేర్కొన్నారు. ప్రధాన ప్రవాహంలోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలనుకునే వారికి ప్రభుత్వం, పార్టీ తలుపులు తెరిచి ఉన్నాయని రేవంత్ రెడ్డి చెప్పారు.
అడవుల్లో తుపాకులతో కాకుండా ప్రజాస్వామ్య మార్గంలో సమస్యలను పరిష్కరించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి