పినపాక: డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం భారీ అవగాహన ర్యాలీ




EB NEWS/పినపాక:


ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా “డ్రగ్స్ రహిత తెలంగాణ” లక్ష్యంతో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పినపాక  మండలం, ఏడూళ్ల బయ్యారం క్రాస్ రోడ్ వద్ద భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ద్వారా యువతను మత్తు పదార్థాల నుండి దూరంగా ఉండాలని, సమాజాన్ని మత్తు వ్యసనాల నుంచి రక్షించుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించారు.


ర్యాలీకి మణుగూరు డీఎస్పీ వంగా రవీందర్ రెడ్డి, యాంటీ నార్కోటిక్స్ డీఎస్పీ పుష్పన్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరై ర్యాలీని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ డ్రగ్స్ అనే మత్తు పదార్థాలు యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నాయని, సమాజంలో నేరాలు పెరగడానికి కూడా ఇవే ప్రధాన కారణమని తెలిపారు. డ్రగ్స్ వాడకం పై కఠిన చర్యలు తీసుకుంటామని, ఎవరైనా డ్రగ్స్ వ్యాపారం లేదా వినియోగం గురించి సమాచారం తెలిసినా వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

విద్యార్థులు, యువత, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని “డ్రగ్స్ కు నో చెప్పండి – ఆరోగ్యకరమైన జీవితాన్ని గెలుచుకోండి” అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు.


ఈ కార్యక్రమం ద్వారా డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే నష్టాలపై ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యమని అధికారులు తెలిపారు.


ఈ ర్యాలీలో ఏడూళ్ల బయ్యారం సీఐ వెంకటేశ్వర రావు, ఎస్ఐ సురేష్, తహశీల్దార్ గోపాలకృష్ణ, ఎంఈఓ నాగయ్య, డీఆర్ఓ వెంకటేశ్వర రావు తదితర అధికారులు,  పాల్గొన్నారు. 

Post a Comment

కొత్తది పాతది