EB NEWS /అశ్వాపురం
అశ్వాపురం మండలం మిట్టగూడెంలోని గిరిజన గురుకుల డిగ్రీ కళాశాలలో విద్యార్థులు వినూత్న కార్యక్రమంతో అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. కళాశాల ప్రాంగణంలోనే అధ్యాపకులతో కలిసి ఆకుకూరలు, కూరగాయల తోటలను పెంచుతూ స్వయంగా పంటలు పండిస్తున్నారు.
ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించిన తాజా కూరగాయలనే హాస్టల్ మధ్యాహ్న భోజనానికి ఉపయోగించడం విశేషం. దీంతో విద్యార్థులకు ఆరోగ్యకరమైన ఆహారం అందడమే కాకుండా, ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కూడా పెరుగుతోంది.
విద్యార్థుల్లో శ్రమ విలువను పెంపొందించడం, పర్యావరణ పరిరక్షణపై చైతన్యం కల్పించడం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని కళాశాల ప్రిన్సిపల్ బి. రవి తెలిపారు.
ఈ విధానం ద్వారా హాస్టల్ భోజనానికి అయ్యే ఖర్చు కూడా కొంత వరకు తగ్గుతుండటం మరో ప్రత్యేకతగా మారింది. విద్యార్థుల ఈ చొరవకు స్థానికులు, అధికారులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి