మణుగూరులో ఘర్షణలపై అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై శ్రావణ్ కుమార్



EB NEWS/మణుగూరు:


మణుగూరు: పట్టణంలో ఇటీవల కొంతమంది గ్రూపులుగా ఏర్పడి ఘర్షణలకు దిగుతున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై శ్రావణ్ కుమార్ సూచించారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా ఎక్కడైనా గొడవలు, అనుమానాస్పద గుంపులు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.


ఆటో డ్రైవర్లు, వాహనదారులు, వ్యాపారులు మరియు సాధారణ ప్రజలు ఎలాంటి వాగ్వాదాలకు దూరంగా ఉండాలని, చిన్న విషయాలను పెద్ద గొడవలుగా మార్చకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పట్టణంలో శాంతి భద్రతలు కాపాడటానికి పోలీసులతో సహకరించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు.


ఎవరైనా చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు భయపడకుండా, నిస్సంకోచంగా పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్సై శ్రావణ్ కుమార్ విజ్ఞప్తి చేశారు.


Post a Comment

కొత్తది పాతది