EB NEWS/బూర్గంపాడు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం కృష్ణసాగర్ బట్టుగూడెం గ్రామంలో పోడు భూముల విషయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అటవీ భూముల వివాదం నేపథ్యంలో గ్రామానికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు - ఆదివాసీ గిరిజనుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
ఈ వాగ్వాదం క్రమంగా తోపులాటకు దారి తీసినట్లు సమాచారం. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
అయితే ఆ ప్రదేశంలో అసలు ఏం జరిగిందన్న విషయంపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అధికారుల నుండి స్పష్టమైన సమాచారం రావాల్సి ఉంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి