ఇరాన్–ఇజ్రాయెల్ టెన్షన్.. ఐపీఎల్ షెడ్యూల్ మారుతుందా?



EB NEWS/భారత్:


ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో మార్చి 28 నుంచి ప్రారంభం కావాల్సిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026పై ప్రభావం ఉంటుందా అన్న చర్చ మొదలైంది. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో విదేశీ ఆటగాళ్ల రాకపోకలు, అంతర్జాతీయ విమాన సర్వీసులపై పరిమితులు విధించే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అలాగే గ్యాస్ సరఫరా సమస్యలు వంటి అంశాలు కూడా చర్చకు వస్తున్నాయి.


అయితే ఈ విషయంపై బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పందిస్తూ.. ఐపీఎల్ టోర్నీ షెడ్యూల్ ప్రకారమే ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని, టోర్నీ నిర్వహణపై ఎలాంటి ప్రభావం లేదని తెలిపారు.


ఈ సీజన్ తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) – సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) జట్లు తలపడనున్నాయి. మొదటి దశలో 10 వేదికల్లో 20 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు.


మరోవైపు ఐపీఎల్ ప్రారంభం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రతి మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతుందనే అంచనాలతో క్రికెట్ ప్రేమికుల్లో ఉత్సాహం నెలకొంది.


Post a Comment

కొత్తది పాతది