జిల్లా కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన సమాచార హక్కు చట్టం యాక్టివిటీ అసోసియేషన్ అధ్యక్షుడు






EB NEWS/పినపాక:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ గౌరవనీయులు  అంకిత్ ఐఏఎస్ సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం (ఐడీఓసీ)లో  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ములుగు జిల్లాల సమాచార హక్కు చట్టం యాక్టివిటీ అసోసియేషన్ అధ్యక్షులు వాగబోయిన సాంబశివరావు దొర మర్యాదపూర్వకంగా కలిశారు.


ఈ సందర్భంగా కలెక్టర్ గారికి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో ప్రజలకు సమాచార హక్కు చట్టం గురించి అవగాహన పెంచేందుకు చేపడుతున్న కార్యక్రమాలపై కలెక్టర్‌కు వివరించారు.


ప్రజలకు ప్రభుత్వ సేవలు పారదర్శకంగా అందేందుకు సమాచార హక్కు చట్టం కీలక పాత్ర పోషిస్తుందని సాంబశివరావు దొర తెలిపారు. జిల్లా అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని ఆయన పేర్కొన్నారు.


Post a Comment

కొత్తది పాతది