EB NEWS/భద్రాచలం:
భద్రాచలానికి సీఎం రేవంత్ రెడ్డి రానున్న నేపథ్యంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ఆదేశాలు జారీ చేశారు. శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భద్రాద్రి జిల్లా సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అడిగిన వెంటనే అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేస్తున్నారని తెలిపారు. భద్రాచలం అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు.
శ్రీరామనవమి వేడుకలు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు ఆదేశించారు. భద్రత, రవాణా, తాగునీరు, పారిశుద్ధ్యం వంటి అన్ని ఏర్పాట్లు సమగ్రంగా ఉండేలా చూడాలని సూచించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి