BIG BREAKING: యుద్ధ ఉద్రిక్తతల మధ్య దుబాయ్‌లో నిలిచిపోయిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు!

 


EB NEWS/Telangana:

కుటుంబ సభ్యులతో వ్యక్తిగత పర్యటన కోసం 5 రోజుల క్రితం దుబాయ్వె ళ్లిన తెలంగాణ వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అక్కడే నిలిచిపోయారు.


ఇరాన్ యుద్ధ ఉద్రిక్తతల ప్రభావంతో దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో విమానాల రాకపోకలు తాత్కాలికంగా నిలిపివేయడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఎయిర్‌స్పేస్ క్లియరెన్స్ రాకపోవడంతో విమాన సర్వీసులు పూర్తిగా నిలిచిపోయినట్లు సమాచారం.


మంత్రి ప్రస్తుతం సురక్షిత ప్రాంతంలో ఉన్నారని, ఎలాంటి ప్రమాదం లేదని ఆయన వర్గాలు తెలిపాయి. “నేను సేఫ్‌గా ఉన్నాను. పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్న వెంటనే భారత్‌కు తిరిగి వస్తాను,” అని మంత్రి పేర్కొన్నారు.


యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో గల్ఫ్ ప్రాంతంలో ప్రయాణాలపై తీవ్ర ప్రభావం పడుతున్న నేపథ్యంలో, భారతీయులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.


ఇప్పటివరకు అధికారికంగా విమాన సర్వీసులు పునరుద్ధరణపై స్పష్టత రాలేదు. ఎయిర్‌పోర్ట్ క్లియరెన్స్ వచ్చిన వెంటనే మంత్రి తిరుగు ప్రయాణం చేపట్టే అవకాశం ఉంది.


Post a Comment

أحدث أقدم