EB NEWS/అశ్వాపురం:
అశ్వాపురం మండలంలో పశువుల అక్రమ రవాణాపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. పలు అక్రమ పశువుల రవాణా కేసుల్లో నిందితుడిగా ఉన్న హైదరాబాద్‌కు చెందిన మహమ్మద్ మొయిజ్ ఖురేషీని సోమవారం అశ్వాపురం తహసీల్దార్ ఎదుట హాజరు పరిచి బైండోవర్ చేశారు.
ఇకపై పశువుల అక్రమ రవాణాకు పాల్పడకూడదని హెచ్చరిస్తూ ₹5 లక్షల పూచీకత్తుతో ఒక సంవత్సరం పాటు సత్ప్రవర్తనతో ఉండేలా అధికారులు బైండోవర్ చేశారు.
పశువుల అక్రమ రవాణా వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అశ్వాపురం సీఐ అశోక్ రెడ్డి స్పష్టం చేశారు.
అలాంటి కార్యకలాపాలను అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేకంగా నిఘా పెంచినట్లు తెలిపారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి