మర్చి మొదటి వారంలోనే మండుతున్న ఎండలు.. 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు




 EB NEWS/తెలంగాణ:


తెలంగాణలో మార్చి మొదటి వారంలోనే ఎండలు తీవ్రరూపం దాల్చాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌ను దాటుతున్నాయి. ఖమ్మం, మహబూబాబాద్, కొత్తగూడెం, ములుగు, మంచిర్యాల, ఆదిలాబాద్, జగిత్యాల జిల్లాల్లో శుక్రవారం 40–41 డిగ్రీల వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

సాధారణంగా మార్చి మధ్య నుంచి పెరగాల్సిన ఎండలు ఈసారి ముందుగానే తీవ్రంగా ఉండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో బయటకు రావడం కష్టంగా మారింది.

ఇక రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సాధారణం కంటే 2–3 డిగ్రీల మేర గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించించారు.

అధిక ఎండల నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, మధ్యాహ్నం వేళల్లో అవసరం లేకుండా బయటకు వెళ్లకుండా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.



Post a Comment

కొత్తది పాతది