EB NEWS/మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన కలెక్టర్ అంకిత్ మణుగూరు ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రిని గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించిన కలెక్టర్, రోగులకు అందుతున్న వైద్య సేవలు, వైద్య సిబ్బంది హాజరు, మందుల లభ్యత తదితర అంశాలపై వివరాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా వార్డులను సందర్శించి చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడిన కలెక్టర్, వారికి అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో పరిశుభ్రత, అవసరమైన వైద్య పరికరాలు, మందుల నిల్వలు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
రోగులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వైద్యులు, సిబ్బంది సమయానికి విధులకు హాజరై నాణ్యమైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. ఆసుపత్రి నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం కనిపించినా చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఈ తనిఖీలో ఆసుపత్రి సూపరింటెండెంట్, వైద్యులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి