భద్రాద్రి: పాత కక్షలు రక్తపాతం… సుపారి ఇచ్చి హత్య చేసిన కేసు ఛేదించిన పోలీసులు

G Rajashekar
By -
0



EB NEWS/భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. గత నెల 28న అశ్వాపురంపాడు గ్రామంలో కోహాసి వెంకటేశ్వర్లు హత్యకు గురైన ఘటనకు సంబంధించిన మిస్టరీని పోలీసులు వెలికితీశారు.


కరకగూడెం సీఐ వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం, పాత కక్షల నేపథ్యంలో రూ.50 వేల సుపారి ఇచ్చి వెంకటేశ్వర్లును హత్య చేయించినట్లు వెల్లడైంది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న వజ్జ భీమరాజు, మడివి మంగయ్య, మడివి నందయ్య సహా మొత్తం ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.


నిందితులను గురువారం కోర్టులో హాజరుపరచగా, రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన గొడ్డలి, బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ కేసును వేగంగా ఛేదించిన పోలీసులను స్థానికులు అభినందించారు.




కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)