మణుగూరు రోడ్డుకి మోక్షం ఎన్నడో?

G Rajashekar
By -
0



EB NEWS/మణుగూరు:

మణుగూరు నుంచి బీటీపీఎస్ వరకు బొగ్గు, ఇసుక  లారీల వల్ల రహదారి గోతులు, దుమ్ము ధూళితో  తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రహదారి పై వెళ్లాలంటే గుండెలు అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఉందని వారు చెబుతున్నారు. లారీల వల్ల అనేక ప్రమాదాల జరుగుతుంటే అధికారులు నిమ్మకు నీరులా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమాయక ప్రజల ప్రాణాలంటే లెక్క లేదా అన్న ప్రశ్న తలెత్తుతోంది.   పాలకులు మారినా కూడా ఫలితం శూన్యమే అని విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.ఇకనైనా రోడ్డుకు మోక్షం కల్పించాలని,  అధికారులు, పాలకులు స్పందించి రోడ్డును  మరమ్మతులు చేసి, లారీల అధిక వేగాన్ని  నియంత్రించేలా తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా వారు కోరుతున్నారు.

إرسال تعليق

0 تعليقات

إرسال تعليق (0)