MPTC, ZPTC ఎన్నికలు.. పరీక్షల తర్వాతే నిర్వహణకు సన్నాహాలు

G Rajashekar
By -
0



EB NEWS/ తెలంగాణ:


రాష్ట్రంలో MPTC, ZPTC ఎన్నికలను ఇంటర్, టెన్త్ పరీక్షల అనంతరం నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC)లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది.


మార్చి మొదటి వారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. అనంతరం ఇంటర్, టెన్త్ వార్షిక పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణలో కీలక పాత్ర పోషించే అధికారులు ఇప్పటికే వివిధ పనుల్లో నిమగ్నమయ్యే పరిస్థితి ఉంది.


ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం, పరీక్షల అనంతరం MPTC, ZPTC ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Tags:

إرسال تعليق

0 تعليقات

إرسال تعليق (0)