మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్యకు డాక్టరేట్ గౌరవం

 


EB NEWS/ ఇల్లందు:


రాజకీయాల్లో నిరాడంబరతకు, నిజాయితీకి ప్రతీకగా గుర్తింపు పొందిన ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్యకు అరుదైన గౌరవం దక్కింది. చెన్నైలోని గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ ఆయన ప్రజా సేవలను గుర్తిస్తూ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది.

ఐదుసార్లు ఎమ్మెల్యేగా ప్రజల మద్దతుతో విజయం సాధించిన గుమ్మడి నరసయ్య, పదవులు చేపట్టినా సాధారణ జీవన విధానాన్ని కొనసాగిస్తూ ప్రజలతో మమేకమయ్యారు. ప్రజా సమస్యలపై నిబద్ధతతో పనిచేసిన నాయకుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది.

ఆయనకు డాక్టరేట్ లభించడం పట్ల నియోజకవర్గ వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది.పలువురు ప్రజా ప్రతినిధులు, అభిమానులు అభినందనలు తెలియజేశారు.

Post a Comment

కొత్తది పాతది