ఫిబ్రవరి 15న భద్రాచలంలో గోదావరి నది హారతి

 


EB NEWS: భద్రాద్రి:


భద్రాచలంలో గోదావరి ఘాట్ వద్ద ఫిబ్రవరి 15న నదీహారతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

శ్రీ సీతా రామచంద్ర స్వామికి అంకితంగా నిర్వహించే ఈ నదీహారతి కార్యక్రమం సాయంత్రం 5:30 నుంచి 6:30 గంటల వరకు జరుగుతుందని తెలిపారు. ఈ ఆదివారం మహాశివరాత్రి సందర్భంగా ఈ కార్యక్రమం మరింత విశేషంగా నిలుస్తుందని పేర్కొన్నారు.

ఈ మహత్తర కార్యక్రమంలో భద్రాచలం భక్తులు మాత్రమే కాకుండా జిల్లా వాసులు, ఆసక్తి కలిగిన ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి అనుగ్రహంతో గోదావరి మాత ఆశీస్సులు పొందాలని కలెక్టర్ కోరారు.

Post a Comment

కొత్తది పాతది