అశ్వాపురంలో గడ్డివాము దగ్ధం

G Rajashekar
By -
0

 


అశ్వాపురం, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వాపురం మండల కేంద్రంలోని కాలువ బజార్‌కు చెందిన నాగనబోయిన శ్రీను గడ్డివాముకి ఆదివారం ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ అదుపులోకి రాకపోవడంతో... మణుగూరు అగ్నిమాపక శాఖకు సమాచారం ఇచ్చారు. వారు వెంటనే స్పందించి సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో రైతుకు సుమారు రూ.20 వేల ఆస్తి నష్టం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియసి ఉంది.

إرسال تعليق

0 تعليقات

إرسال تعليق (0)