దుమ్ము ధూళితో నానా అవస్థలు పడుతున్న ప్రయాణికులు- గడ్డం రాము
మణుగూరు, EB న్యూస్:
మణుగూరు : పట్టణంలోని కాళీమాత ఏరియా, గాంధీ నగర్ ప్రాంతాలలో సింగరేణి సంస్థకు చెందిన బొగ్గు లారీలు జనావాస ప్రాంతాల నుండి అతివేగంగా ప్రయాణించడంతో విపరీతమైన దుమ్ము, ధూళి రేగి, నేరుగా ప్రజల ఇళ్లలోకి చేరుతోందని, సింగరేణి అధికారులు వెంటనే నివారణ కోసం చర్యలు చేేపట్టాలని పట్టణానికి చెందిన గడ్డం రాము మంగళవారం సింగరేణి యాజమాన్యాని కి విజ్ఞప్తి చేశారు. అనంతరం రాము విలేకరులతో మాట్లాడుతూ,బొగ్గు రవాణా చేసే ప్రతి లారీపై తప్పనిసరిగా టార్పాలిన్ కవర్లు ఉండేలా చూడాలని,
ప్రధాన రహదారిపై సి.ఎస్.పి. (CSP) కాటా పరిసరాల్లో భారీ వాహనాలను క్రమపద్ధతి లేకుండా నిలుపుదల చేయడంతో వాహనదారులు ప్రయాణి కులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. మరోవైపు దుమ్ము పిల్లలు, వృద్ధులు తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులకు గురవుతున్నారని పేర్కొన్నారు. జనావా సాల మధ్య వాహనాల అతివేగం ప్రాణా పాయ స్థితిని కలిగిస్తోందని వ్యక్తం చేశా రు. వాహనాల వేగాన్ని కఠినంగా నియంత్రించాలని, దుమ్ము రేగకుండా ప్రధాన రహదారిపై మరియు కాటా ప్రాంతాల్లో క్రమం తప్పకుండా నీటిని చల్లించాలన్నా రు. రహదారిపై వాహనాలు నిలపకుండా, భారీ వాహనాల కోసం ప్రత్యేకంగా పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేయాలని
కోరారు. తమ విజ్ఞప్తి ఫై సింగరేణి అధికా రులు సానుకూలంగా స్పందించారని రాము మీడియాకు వెల్లడించారు.

إرسال تعليق