EB న్యూస్, కరకగూడెం
గ్రామ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కరకగూడెం మండల కేంద్రంలోని మొండిచింత వద్ద నూతన వారపు సంతను ఘనంగా ప్రారంభించారు. స్థానిక ప్రజాప్రతినిధులు రిబ్బన్ కట్ చేసి సంతను ప్రారంభించారు.
వారపు సంత ద్వారా రైతులు తమ పంటలను నేరుగా విక్రయించే అవకాశం లభిస్తుందని, చిన్న వ్యాపారులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని నాయకులు తెలిపారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి