నర్సంపేట మున్సిపల్ ఫలితాలు ఇవే… ఎవరికెన్ని వార్డులు?



 EB News : నర్సంపేట 

వరంగల్ జిల్లా , నర్సంపేట మున్సిపాలిటీలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పూర్తైంది. మొత్తం 30 వార్డుల ఫలితాలు వెలువడగా కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని నమోదు చేసింది.

అధికారిక లెక్కల ప్రకారం కాంగ్రెస్ 21 వార్డుల్లో విజయం సాధించింది. బీఆర్‌ఎస్ 6 స్థానాలు దక్కించుకోగా, బీజేపీ, సీపీఎం, స్వతంత్ర అభ్యర్థులు తలా ఒక స్థానంలో గెలుపొందారు.

ఈ ఫలితాలతో నర్సంపేట మున్సిపల్ పాలనలో కాంగ్రెస్ బలమైన స్థానం ఏర్పరుచుకున్నట్లు స్పష్టమవుతోంది.

Post a Comment

కొత్తది పాతది