ఎదురెదురుగా ఢీకొన్న బైకులు — ఇద్దరికీ తీవ్ర గాయాలు


 మణుగూరు,EB న్యూస్:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం పరిధిలోని తోగ్గూడెం వద్ద సమ్మక్క, సారలమ్మ గుడి సమీపంలో రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్న ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు.

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి గాయపడిన వారిని మణుగూరు 100 పడకల ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Post a Comment

కొత్తది పాతది