ఇసుక లారీల కింద చితికిపోతున్న జీవితాలు – మరో నిండు ప్రాణం బలి





 భద్రాద్రి కొత్తగూడెం, EB  న్యూస్:


భద్రాచలం నియోజకవర్గం, దుమ్ముగూడెం మండలంలో  లారీల నిర్లక్ష్య దౌర్జన్యానికి మరో నిండు ప్రాణం బలైంది. ఈరోజు ఉదయం 11 గంటల సమయంలో ములకపాడు ఎక్స్ రోడ్డు వద్ద ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న దంపతులను  లారీ ఢీ కొట్టగా, మహిళ అక్కడికక్కడే దారుణంగా మృతి చెందింది. తలకు తీవ్ర గాయమై మెదడు బయటికి వచ్చే స్థితిలో ఆమె ప్రాణాలు కోల్పోయిన సంఘటన అక్కడ ఉన్న వారిని కలిచివేసింది.


 లారీల కారణంగా ఈ ప్రాంతంలో ఇప్పటికే అనేక ప్రమాదాలు జరిగినా, అధికారుల నివారణ చర్యలు మాత్రం కాగితాలకే పరిమితమయ్యాయి. రహదారులపై వేగ నియంత్రణ, వాహనాల తనిఖీలు, నిబంధనల అమలు వంటి చర్యలు లేకపోవడంతో సాధారణ ప్రజల ప్రాణాలు ప్రతిరోజూ ప్రమాదంలో పడుతున్నాయి.


ఇంకెన్ని ప్రాణాలు పోతే అధికారులు స్పందిస్తారు? బాధిత కుటుంబానికి తక్షణ న్యాయం అందించడమే కాకుండా, ఇసుక లారీలపై కఠిన నియంత్రణ చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మార్గంలో ప్రయాణించే ప్రతి ఒక్కరి భద్రత కోసం ఇప్పటికైనా పాలకులు, అధికారులు మేల్కొని తక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Post a Comment

أحدث أقدم