తెలంగాణ: రాష్ట్రాన్ని మార్చే మూడు నెలలు – ప్రభుత్వం బిగ్ యాక్షన్ ప్లాన్

G Rajashekar
By -
0

 


EB NEWS/తెలంగాణ:


తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. మార్చి 2 నుంచి జూన్ 9 వరకు రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమం మరియు అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.


ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. ఆయా జిల్లాల్లో అమలు చేయాల్సిన అభివృద్ధి పనులపై సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించింది.


ప్రభుత్వం ముఖ్యంగా ఈ శాఖలపై ఫోకస్ పెట్టింది:


* గ్రామీణాభివృద్ధి

* మున్సిపల్ పరిపాలన

* వైద్య ఆరోగ్య శాఖ

* విద్యా రంగం

* పంచాయతీరాజ్

* వ్యవసాయం

* రెవెన్యూ శాఖ


ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు చేపడుతున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.


గ్రామీణ స్థాయి నుంచి పట్టణాల వరకు మౌలిక వసతుల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, ప్రజా సేవల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు సమాచారం.


రాబోయే మూడు నెలల్లో రాష్ట్రంలో అభివృద్ధి వేగం మరింత పెరగనుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.


Tags:

إرسال تعليق

0 تعليقات

إرسال تعليق (0)