అశ్వరావుపేట, EB న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వరావుపేట మున్సిపాలిటీ 10వ వార్డులో విజయం సాధించిన మిండ హరిబాబు చుట్టూ వివాదం రేగింది. పోలింగ్ అనంతరం వార్డుకు వెళ్లిన ఆయన, తమ పార్టీకి ఓటు వేయలేదని అనుమానం వ్యక్తం చేస్తూ తాను పంపిణీ చేసిన కుక్కర్లు, నగదు తిరిగి ఇవ్వాలని కోరినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఫలితాలు రాకముందే ఓటు వేయలేదని ఎలా చెబుతారని ఓటర్లు నిలదీయగా, నిరసనగా అందుకున్న కుక్కర్లను రోడ్డుపై పెట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు.
తరువాత వెలువడిన ఫలితాల్లో హరిబాబు విజయం సాధించినప్పటికీ, గిఫ్టులు వెనక్కి ఇవ్వాలని కోరడం ద్వారా తమ పరువు తీసారని ఓటర్లు వాపోతున్నారు. ఈ ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి