మున్సిపల్ ఎన్నికల ఫలితాలు: అశ్వారావుపేట కాంగ్రెస్ కైవసం చేసుకున్న వార్డులు ఇవే

 


ఖమ్మం జిల్లా, EB న్యూస్:


ఖమ్మం జిల్లా, మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. మొత్తం 22 వార్డుల్లో ఎక్కువ స్థానాలను కాంగ్రెస్ అభ్యర్థులు గెలుచుకున్నారు.

1 నుంచి 6వ వార్డు, 8 నుంచి 13వ వార్డు, 15, 16, 18, 20, 22వ వార్డుల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. 

7, 14వ వార్డుల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులు గెలిచారు. 17వ వార్డులో బీజేపీ అభ్యర్థి విజయం సాధించగా, 19 మరియు 21వ వార్డుల్లో స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు.


మొత్తంగా మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ బలమైన స్థానం దక్కించుకుని, స్థానిక రాజకీయాల్లో తన ఆధిపత్యాన్ని మరోసారి చాటుకుంది.

Post a Comment

కొత్తది పాతది