సిద్దిపేట జిల్లా, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలంలోని ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి ఆలయంలో పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా అభిషేకాలు, ప్రత్యేక ఆర్చనలు నిర్వహించిన ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రజల సుఖసంతోషాలు, శాంతి భద్రతలు , నియోజకవర్గ అభివృద్ధి వేగవంతం కావాలని ప్రార్థించారు. అనంతరం ఆలయ అర్చకులు, నాయకులు, భక్తులతో కలిసి స్వామివారి ఆశీస్సులు పొందారు.

إرسال تعليق