పినపాక: కబడ్డీ పోటీలకు సర్వం సిద్ధం

 


పినపాక, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


పినపాక మండలం ఏడూళ్ళ బయ్యారంలో అండర్-17 బాలుర కబడ్డీ జాతీయస్థాయి పోటీలకు వేదికగా అన్ని ఏర్పాట్లు జోరుగా కొనసాగుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఈ ఏర్పాట్లను పరిశీలించి, ఇది జిల్లాకు గర్వకారణమని పేర్కొన్నారు . ఈ పోటీలు పినపాక మండలానికి ప్రత్యేక గుర్తింపు తీసుకురానున్నాయి.


పోటీలు జనవరి 7 నుంచి 11 వరకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరగనున్నాయి . గతంలో ఇక్కడే నవంబర్ 8,9,10 తేదీల్లో రాష్ట్రస్థాయి అండర్-17 బాలబాలికల కబడ్డీ పోటీలు విజయవంతంగా నిర్వహించారు . యువత సోషల్ మీడియాలో 'మన గ్రామం, మన క్రీడలు, మన బాధ్యత' అనే ట్యాగ్‌తో ప్రచారం చేస్తోంది.


కలెక్టర్ అధికారులందరినీ సహకరించాలని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు . రాష్ట్రవ్యాప్తంగా కబడ్డీ ప్రేమికులను ఆహ్వానించారు . ఈ క్రీడలు జిల్లా, మండలానికి గొప్ప పేరు తెచ్చిపెడతాయి.

Post a Comment

కొత్తది పాతది