కాకినాడ జిల్లా, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
రావ్తలపూడి మండలం, సార్లంక గ్రామంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా గ్యాస్ సిలెండర్లు పేలిపోవడంతో భయానక అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా చెలరేగిన భారీ మంటలు క్షణాల్లోనే ఇళ్లను చుట్టుముట్టి 55 ఇళ్లు పూర్తిగా దగ్ధం చేశాయి.
మంటల తీవ్రతకు ఏం జరుగుతుందో అర్థం కాక గ్రామస్తులు భయంతో పరుగులు తీశారు. చిన్నపిల్లల అరుపులు, వృద్ధుల కన్నీళ్లతో ఆ ప్రాంతం మొత్తం హృదయ విదారక దృశ్యంగా మారింది.
సమాచారం అందగానే ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే అప్పటికే అనేక కుటుంబాలు తమ ఇళ్లు, జీవనాధారం కోల్పోయి రోడ్డున పడ్డాయి.
ఈ దుర్ఘటనతో సార్లంకపాడు గ్రామం మొత్తం విషాదంలో మునిగిపోయింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి