కరకగూడెం: విద్యార్ధులకు విద్యా సామాగ్రి పంపిణీ

 


కరకగూడెం, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


కరకగూడెం మండలం, అశ్వారావు పాడు గోత్తి కోయ గ్రామంలో సరస్వతి విద్య పీఠం ఆధ్వర్యం లో నడిచే పాఠశాలలో ఉపాధ్యాయుల చేతుల మీదుగా పిల్లలకు విద్యా సామగ్రి విద్యార్థులకు అందించడం జరిగింది. అమ్మ సంస్థ ఫౌండర్ కరకగూడెం గ్రామ నివాసి అండెం యాకన్న దాత  సహాయంతో  అందజేయబడ్డాయి. ఈ సందర్భంగా అండెం. యాకన్న మాట్లాడుతూ విద్యాభివృద్ధికి  తన వంతు సహకారం అందిస్తున్నట్లు తెలిపారు...విద్యార్థులు మంచి క్రమశిక్షణగా చదవాలని, తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల సౌకర్యాలను ఉపయోగించి పిల్లలకు మంచి నైపుణ్యంగా ఉపాధ్యాయ సేవలను పొందాలని కోరారు.చదువే అన్నిoటికి మూలమని చదువు పట్ల శ్రద్ధ పెట్టాలని విద్యార్ధులకు  ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో అమ్మ సంస్థ ఫౌండర్ అండెం యాకన్న, ఉపాధ్యాయులు రోజా రాణి, నాగమణి పాల్గొన్నారు

Post a Comment

أحدث أقدم