ఆంధ్రప్రదేశ్ : ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
నెల్లూరు(D) విడవలూరు(M)లో దారుణం చోటు చేసుకుంది. ముదివర్తి గ్రామానికి చెందిన రవికుమార్, సుప్రజ దంపతులు కుమారుడు ప్రేమ్‌చంద్ (19)తో కలిసి నివసిస్తున్నారు. మద్యానికి బానిసైన రవికుమార్ తరచూ భార్యతో గొడవపడేవాడు. కొడుకు ప్రేమ్‌చంద్ మందలించడంతో రవికుమార్ అతనిపై కోపం పెంచుకున్నాడు. శుక్రవారం ఇంట్లో నిద్రిస్తున్న ప్రేమ్‌చంద్‌పై రోకలి బండతో తలపై కొట్టి చంపాడు. పోలీసులు కేసు నమోదు చేసి రవికుమార్‌ను అరెస్ట్ చేశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి