ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లాలో 103మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఇందులో 49 మందిపై కలిపి రూ.1 కోటి వరకు రివార్డు ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. లొంగిపోయిన వారిలో 22 మంది మహిళలు ఉన్నారు. మావోయిస్టు భావజాలంపై అసంతృప్తి, అంతర్గత కలహాలే కారణమని ఎస్పీ జితేంద్ర యాదవ్ పేర్కొన్నారు. ఒక్కరోజులో ఇంత పెద్ద ఎత్తున లొంగిపోవడం ఇదే మొదటిసారి. లొంగిపోయిన వారికి ప్రభుత్వం రూ.50వేలు చొప్పున సాయం అందించింది.
ఇది కూడా చదవండి..
అన్నింటినీ బలంగా ఎదుర్కొనే సత్తా భారత్‌కు ఉంది: నిర్మలాసీతారామన్
Oct 03, 2025,
అన్నింటినీ బలంగా ఎదుర్కొనే సత్తా భారత్‌కు ఉంది: నిర్మలాసీతారామన్
ఢిల్లీలో జరిగిన కౌటిల్య ఎకనామిక్ కాన్‌క్లేవ్ 2025లో పాల్గొన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నిర్మాణాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. హఠాత్తుగా ఎదురయ్యే షాక్‌లను బలంగా తట్టుకునే సామర్థ్యం భారత్ వద్ద ఉందని ఆమె పేర్కొన్నారు. భౌగోళిక రాజకీయ సంఘర్షణలు, ఆంక్షలు, సుంకాలు, విబేధాలు ప్రపంచ సరఫరా గొలుసులను దెబ్బతీస్తున్నా, భారత ఆర్థిక వ్యవస్థ నిలకడగా ఉందని, స్థిరంగా వృద్ధి చెందుతోందని చెప్పారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి