కొబ్బరి బొండాల్లో గంజాయి స్మగ్లింగ్ ముఠా అరెస్టు..!!

 


ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


హైదరాబాద్ పెద్ద అంబర్ పేట వద్ద భారీగా గంజాయి పట్టుబడింది. 


విశాఖ నుంచి రాజస్థాన్ కు తరలిస్తున్న సుమారు 400 కిలోల గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 


ఎవరికీ అనుమానం రాకుండా, కొబ్బరి బొండాల మాటున గంజాయి తరలిస్తుండగా ఈగల్ బృందం గుర్తించింది. 


ఈ ఘటనలో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, డీసీఎం, కారును స్వాధీనం చేసుకున్నారు.

Post a Comment

కొత్తది పాతది