మణుగూరు, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్ ప్రతినిధి రాజశేఖర్:
మణుగూరు నుంచి బిటిపిఎస్ కి వెళ్లే రహదారి గోతులమయంగా ఉందని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దుమ్ము ధూళితో నిండి ఉండడం వల్ల రహదారి పై వచ్చే వాహనాలు కనపడక ప్రమాదాల బారిన పడుతున్నామని చెబుతున్నారు. ద్విచక్ర వాహనదారులు ఈ రూట్లో ప్రయాణాలు చేయాలంటే వామ్మో అంటున్నారు. బిటిపిఎస్ కి వెళ్లే బొగ్గు లారీలు అతివేగంతో వెళ్తూ వాహనదారులను భయాందోళనకు గురిచేస్తున్నాయని అంటున్నారు.ప్రయాణాలు చేయాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వెళ్లాల్సి వస్తుందని పలువురు వాహనదారులు ఈ సందర్భంగా తెలిపారు. ఈ రహదారిలో ప్రయాణించే వారు అతి జాగ్రత్తగా వాహనాలు నడపాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పొచ్చు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి లారీల వేగాలని నియంత్రించి, రోడ్డు మరమ్మత్తులు నిర్వహించాలని వారు కోరుతున్నారు.
إرسال تعليق