మూడేళ్ల బాబు వైద్య ఖర్చులకు 20 వేలు ఆర్థిక సహాయం



 మణుగూరు, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


వైద్య ఖర్చులకు 20 వేల రూపాయలను సహాయంగా అందించిన జనం కోసం మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. .. మణుగూరు మండల పరిదిలోని కొండాయిగూడెం గ్రామానికి చెందిన కాటారపు మహేష్, స్వప్న దంపతుల కుమారుడు దేవానంద్ 3 సంవత్సరాలు ఊపిరితిత్తులో ఇన్సఫెక్షన్ వచ్చి ప్రాణాపాయ స్థితి లో ఖమ్మం హాస్పిటల్ icu లో ఉన్నాడు అని నిరుపేద కుటుంబానికి చెందిన వారు వైద్య ఖర్చులకు ఇబ్బంది పడుతున్నారు అని తెలిసి స్పందించిన మణుగూరు పట్టణానికి చెందిన జనం కోసం మనం స్వచ్చంద సంస్థ సభ్యులు ఖమ్మం లోని శ్రీమంత హాస్పిటల్ వెళ్లి బాబు కుటుంబసభ్యులను కలిసి బాబు ఆరోగ్యపరిస్థితి అడిగి తెలుసుకుని 20 వేల రూపాయలను సహాయంగా అందించారు ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు దుబాకుల మహేష్, మిర్యాల రామయ్య పాల్గొన్నారు

Post a Comment

أحدث أقدم