భద్రాచలం: 10 లక్షల విలువ గల బాణసంచా అక్రమ నిల్వ... అధికారులు స్వాధీనం.

G Rajashekar
By -
0





భద్రాచలం, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


భద్రాచలం పట్టణంలో మంగళవారం సాయంత్రం టాస్క్ ఫోర్స్ బృందంతో కలిసి పోలీసులు నాలుగు చోట్ల బాణసంచా అక్రమ నిల్వలపై దాడులు నిర్వహించారు. జనసంచార ప్రాంతాలు, ఇళ్ల మధ్యలో అనుమతి లేకుండా భారీగా బాణసంచా నిల్వ చేసినట్లు సమాచారం అందడంతో గోదాములను తనిఖీ చేశారు. దీపావళి పండుగ సందర్భంగా వ్యాపారులు ముందుగానే తెప్పించిన ఈ బాణసంచాకు అనుమతులు తీసుకోలేదని, రూ. 10 లక్షల విలువైన బాణసంచాను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)