ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
హైదరాబాద్ నూతన పోలీసు కమిషనర్గా వీసీ సజ్జనార్ బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డ్రగ్స్పై ఉక్కుపాదం మోపుతామని అన్నారు.
“దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం హైదరాబాద్.
ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య డ్రగ్స్.
దీనిపై ఉక్కుపాదం మోపుతాం.
డ్రగ్స్ సరఫరాదారులపై కఠిన చర్యలు తీసుకుంటాం.
ఇతర రాష్ట్రాల పోలీసులతో సమన్వయం చేసుకుని ముందుకెళ్తాం.
అవసరమైతే మరింత సిబ్బందిని కేటాయించి చర్యలు తీసుకుంటాం” అని పేర్కొన్నారు~£
إرسال تعليق