కరకగూడెం మండల ప్రజలకు పోలీస్ వారి ముఖ్య సూచన 50 వేలకు మించి నగదు వెంట తీసుకెళ్లొద్దు

 


కరకగూడెం, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


 ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చినందున ప్రజలు 50 వేలకు మించి నగదు తమ వెంట తీసుకువెళ్లకూడదు

రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఒక వ్యక్తి రూ.50 వేల నగదు మాత్రమే తీసుకెళ్లేందుకు అనుమతి ఉంటుంది. కావున అంతకన్నా ఎక్కువ ఉండి సరైన పత్రాలు లేకపోతే దానిని సీజ్ చేస్తాము తక్కువ మొత్తంలో దొరికిన డబ్బును రెవెన్యూ అధికారుల వద్ద జమ చేస్తారన్నారు. అదే ఎక్కువగా ఉంటే ఎన్నికల అధికారులు, ఆదాయ పన్ను, జీఎస్టీ అధికారులకు సమాచారం అందించి ఆ డబ్బును కోర్టులో జమ చేయటం జరుగుతుంది అత్యవసర వైద్యం, కళాశాల ఫీజులు, వ్యాపారం, పెళ్లిళ్లు వంటి ముఖ్యమైన అవసరాలకు పెద్ద మొత్తంలో నగదు తీసుకెళ్లేవారు సరైన ఆధారాలు దగ్గర ఉంచుకోవాలి తనిఖీల సమయంలో అవి చూపించినట్లయితే ఆ తర్వాత వాటిని విచారించిన తరువాత విడుదల చేయటం జరుగుతుంది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున షాపింగ్ చేసిన యెడల దానికి సరియైన బిల్ ను తీసుకొని మాత్రమే వాటిని తీసుకొని.రావాలి 

ఇట్లు 

P. V. N. RAO 

Si karakagudem

Post a Comment

أحدث أقدم