పినపాక, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
గోదావరి వరద పెరగడంతో గోదావరి పోటు ప్రాంతం చింతల బయ్యారంలో చేపలు పడుతుండగా ఓ వింత చేప జాలర్లకు చిక్కిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. జాలర్లు తెలిపిన వివరాల ప్రకారం చింతల బయ్యారం కుంటలో చేపలు పట్టడానికి ప్రయత్నించగా ఆ చేపలతో పాటు ఈ వింత చేప లభించిందని తెలిపారు. మామూలు చేపలకు భిన్నంగా నోరు, రంగు, శరీరం మొత్తం ముల్లులు ఉండటంతో ఆ చేపగురించి ప్రజలు రకరకాలుగా చెప్పుకుంటున్నారు. ఆ చేప ఏ రకానికి చెందిందని తమకు తెలియదన్నారు. దీంతో గ్రామస్తులు ఆ చేపను ఆసక్తిగా చూస్తున్నారు.
إرسال تعليق