TG, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
కొత్తగా రేషన్ కార్డులు పొందిన వారికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వీరికి కూడా ఆరోగ్యశ్రీ పథకం వర్తింపజేసేందుకు కసరత్తు చేస్తోంది.
30 లక్షల మంది లబ్ధిదారుల వివరాలను అధికారులు పోర్టల్‌లో నమోదు చేస్తున్నారు.
ఆరోగ్య శ్రీ, రేషన్ కార్డుల అనుసంధాన ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని అధికారులను మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు.
దీంతో లబ్ధిదారుల సంఖ్య 3.14 కోట్లకు చేరనుంది.
ఇది కూడా చదవండి...
శునకాల నుండి తప్పించుకోవడం గగనమే
- గుంపులు గుంపులుగా స్వైర విహారం చేస్తున్న గ్రామ సింహాలు
- బయటికి వెళ్లాలంటే జంకుతున్న జనం
పినపాక:
సమాజంలో ప్రజలకు అసౌకర్యాలతో పాటు కుక్కల సంచారం కూడా ఓ సమస్యగా మారింది. జనజీవనంలో అనేక పనులు చేసి, అనేక ఇబ్బందుల నుంచి గట్టెక్కి ఇంటికి చేరుకోవాలంటే శునకాల నుంచి తప్పించుకోవడం గగనమవుతోందని ప్రజలు, వాహనదారులు అవేదన చెందుతున్నారు.పినపాక మండల వ్యాప్తంగా గ్రామపంచాయతీలలో కుక్కల బెడద రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది. ఉదయం పూట వాకింగ్ కి వెళ్ళాలన్నా ఈ గ్రామ సింహాలను చూసి భయపడే పరిస్థితి ఉంది. కిరాణా షాపునకు వెళ్లాలంటే భయం, రోడ్డుపై నడవాలంటే ఆందోళన అధికంగా ఉంటుంది.నిత్యం వెళ్లే ప్రాంతమైనా అప్రమత్తం గా ఉండకపోతే కుక్కల బెడద తప్పడం లేదు. వీధి కుక్కల కారణంగా రాత్రి వేళ అయితే ప్రయాణం చేయాలంటే పరిస్థితి మరింత భయానకం గా మారింది .గ్రామాలలో కుక్కలు గుంపులు గుంపులుగా సంచరిస్తున్నాయి. ఏ కుక్క కరిచినా ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సిందే. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం. వీధి కుక్కలతో సమస్య లేకుండా చేసే బాధ్యత స్థానిక సంస్థలదే అయినా ఈ విషయంలో సిబ్బంది తగిన చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. కుక్కల నుండి తమను కాపాడాలని
స్థానికులు కోరుతున్నారు.
ఈ బయ్యారం, పినపాక, జానంపేట, మల్లారం, జగ్గారం, దుగినే పల్లి ప్రధాన కూడలిలో సంచరిస్తున్న కుక్కల
దాడులతో చిన్నపిల్లలు వారి తల్లిదండ్రులు భయపడుతున్నారు. కంట్రోల్ రూమ్ లకు, అధికారులకు ప్రతి రోజూ కుక్కలను నిరోధించి కాపాడాలని ఫోన్లు వస్తున్నాయి. పలు కాలనీల్లో కుక్కలు అధిక సంఖ్యలో స్వైరవిహారం చేస్తుండటంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలాంటే జంకుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి కుక్కలను నియంత్రణకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. వీధి కుక్కల
నియంత్రణ బాధ్యత నిర్వర్తించాల్సిన స్థానిక సంస్థలు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయి. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కోర్టు వ్యవహారాలు ఉండడంతో తలనొప్పి వ్యవహారమంటూ చేతులెత్తేస్తున్నాయి. దీంతో వాటి బెడద రోజురోజుకూ తీవ్రమై ప్రజలు తీవ్ర ఇబ్బందులెదుర్కొంటున్నారు.
కుక్కల నియంత్రణ శాస్త్రీయ పద్ధతిలో కొనసాగాలని హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైన నేపథ్యంలో అధికారులు సైతం ఏమీ చేయలేని పరిస్థితి ఉంది.
హైకోర్టు ప్రతి మున్సిపాలిటీలో కుక్కల నియంత్రణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఇటీవల ఆదేశించిన సంగతి తెలిసిందే. దీనిపై అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది.
ఇది కూడా చదవండి....
చతిస్గడ్, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
బీజాపూర్ జిల్లాలో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది, ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు తెలిసింది, బీజాపూర్ జిల్లాలో సౌత్ వేస్ట్ రీజియన్ లో మావోయిస్టుల కోసం భద్రత బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి, ఈ క్రమంలో ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి...
మావోయిస్టుల కదలికలపై ఇంటెలిజెన్స్ సమాచారంతో భద్రతా బలగాలు ఆ ప్రాంతానికి చేరుకోవడంతో కాల్పులు చోటుచేసుకున్న ట్టు పోలీసులు తెలిపారు. కాగా, మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్ కొనసాగుతోందని, ఘటనా స్థలి నుంచి పెద్దఎత్తున ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని, బస్తర్ రేంజ్ ఐజీపీ సుందర్‌రాజ్ తెలిపారు.
వీటిలో ఏకే 47,ఎస్ ఎల్ ఆర్ రైఫిళ్లు కూడా ఉన్నట్టు చెప్పారు. ఎన్‌కౌంటర్ స్థలం లో నలుగురు మావోయిస్టు ల మృత దేహాలు లభ్యమ య్యాయని, పోలీసులు తెలిపారు.
إرسال تعليق