దయచేసి అప్రమత్తంగా ఉండండి, లోతట్టు ప్రాంతాల నుండి తక్షణమే ఖాళీ చేయండి ⚠️⚠️




ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


 💥 *హెచ్చరిక* 💥



ములుగు, వరంగల్ బెల్ట్ అంతటా తీవ్రమైన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే వెంకటాపురంలో 136మి.మీ నమోదై, రానున్న గంటలలో 200మి.మీ వర్షపాతం కూడా సులువుగా దాటబోతోంది ⚠️⚠️⛈️⛈️⚠️


 రానున్న 12 గంటల్లో, *150-200 మి.మీ తీవ్రమైన వర్షపాతం వరంగల్, హన్మకొండ, ములుగు, భద్రాద్రి - కొత్తగూడెం, భూపాలపల్లి, మహబూబాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, జగిత్యాల, కరీంనగర్‌లోని కొన్ని ప్రాంతాలు* ఉండబోతున్నాయి.



Aslo Read..

మూడురోజులు అతిభారీ నుండి భారీవర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలెర్ట్!


తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వచ్చే మూడు రోజులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాలకు రెడ్ అలెర్ట్ ను జారీ చేసింది.


*అతి భారీ నుండి అత్యంత భారీ వర్షాలు..*

 ఇదిలా ఉంటే నేడు కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి జిల్లాలలో అతి భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. అలాగే అదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, కొత్తగూడెం, భూపాలపల్లి, ములుగు జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది.


ఈ జిల్లాలలో రేపు భారీ వర్షాలు నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, వికారాబాద్ జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే జూలై 24, 26 తేదీలలో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలలో తేలికపాటి నుండి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

Post a Comment

కొత్తది పాతది