మణుగూరు, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
మణుగూరుకు చెందిన న్యాయవాది మరియు సామాజిక కార్యకర్త కర్నె రవి గారు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఈరోజు జరిగిన గ్రీవెన్స్ లో అడిషనల్ కలెక్టర్ శ్రీమతి M. విద్యాచందన గారికి వినతిపత్రం అందజేశారు. ఈ విజ్ఞప్తిలో ఆయన, మణుగూరు–ఏటూరునాగారం ప్రధాన రహదారి దయనీయ స్థితిని వర్ణిస్తూ, ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని హితవు పలికారు.
ఈ రహదారి ద్వారానే వేలాదిమంది విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, గిరిజనులు రోజువారీ ప్రయాణిస్తున్నారు. ఇది తెలంగాణా మరియు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల మధ్య కీలక రవాణా మార్గంగా కూడా పనిచేస్తోంది. అయితే, గత కొంతకాలంగా దీని పరిస్థితి పూర్తిగా అధ్వాన్నంగా మారిందని, పాక్షికంగా పాకించడమే కాకుండా, పూర్తిస్థాయి పునర్నిర్మాణమే దీనికి పరిష్కారమని పేర్కొన్నారు.
కర్నె రవి గారి డిమాండ్లు:
ఆర్ & బి శాఖ ద్వారా రహదారిని పూర్తిగా తనిఖీ చేయాలి.
నాణ్యతతో కూడిన పునర్నిర్మాణం జరగాలి.
అవసరమైతే సింగరేణి లేదా భద్రాద్రి థర్మల్ ప్లాంట్ సహకారం తీసుకోవాలి.
పనులపై అవిచ్ఛిన్న పర్యవేక్షణ ఉండాలి.
ఈ రహదారి పరిస్థితి కేవలం మౌలిక సదుపాయాల సమస్య కాదని, అది ప్రజల జీవితాలతో కూడిన సమస్య అని కర్నె రవి గారు పేర్కొన్నారు. ప్రభుత్వం ఈ అంశాన్ని అత్యవసరంగా పరిగణించి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
إرسال تعليق